కమల్ హాసన్- శంకర్ ల’ఇండియన్ 2′ (భారతీయుడు 2) సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఓ భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించారు దర్శకుడు శంకర్. ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న చిత్రబృందం ప్రస్తుతం భోపాల్‌లో మరో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తారు. దీనికోసం ప్రత్యేకమైన సెట్ నిర్మించారు. ఆ సెట్లో ఏకంగా 2వేల మంది ఫైటర్లతో ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు. సినిమాలో అత్యంత కీలకమైన ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం 40 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ ఈ చిత్రం లో 90ఏళ్ల వృద్ధుడి గా కనిపించబోతున్నాడు. అతనితో ఈ ఫైట్ సీన్ షూట్ చేస్తారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వం లో ఈ సన్నివేశాలను చిత్రీకరించ బోతున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
నటుల్లో ఉత్తమనటుడు కమల్
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ‘భారతీయుడు-2’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. శంకర్ -కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచనాలే ఉన్నాయి . ఇటీవలే రకుల్ జాతీయ మీడియాతో చిట్ చాట్ లో పలు విషయాలు షేర్ చేసుకుంది… ‘కమల్ హాసన్ భారత సినీ పరిశ్రమలో ఉన్న నటుల్లో ఉత్తమనటుడ’ని చెప్పింది. ‘నాకు తెలిసినంత వరకు సినిమాల్లో కమల్ హాసన్ పోషించిన పాత్రలు ఎవరూ చేయలేదు. అలాంటి గొప్ప నటుడితో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంద’ని …’శంకర్-కమల్ క్రేజీ కలయికలో మరోసారి వస్తోన్న ‘భారతీయుడు-2’లో నటించడం చాలా సంతోషంగా ఉంద’ని పేర్కొంది.