రాజ్ తరుణ్ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న’ఒరేయ్.. బుజ్జిగా’ రెండో షెడ్యూల్ అక్టోబర్ 12 నుంచి ప్రారంభమైంది.
నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. ” ఈరోజు నుంచి నాన్‌స్టాప్‌గా ఈ రెండో షెడ్యూల్ జరుగుతుంది. రాజ్ తరుణ్ కి తగిన చక్కటి లవ్‌స్టోరీ ఇది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సూపర్‌హిట్ ని రూపొందించిన కొండా విజయ్‌కుమార్ మరో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నంద్యాల రవి మంచి డైలాగ్స్ రాశారు. వాణీవిశ్వనాథ్‌గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. తప్పకుండా మా ‘ఒరేయ్.. బుజ్జిగా’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది” అన్నారు.
రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ఈ చిత్రం లో నటిస్తున్నారు.
సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: శేఖర్, ఆర్ట్: టి.రాజ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్.