ప్రతిష్టాత్మక ‘సరస్వతి సమ్మాన్- 2019’ పురస్కారాన్ని తెలుగు కవి కె.శివారెడ్డి అందుకున్నారు. ఢిల్లీలో ‘సరస్వతి సమ్మాన్ -2019’ పురస్కారాల ప్రదానోత్సవం 28-9-2019 శనివారం జరిగింది. ‘కేకే బిర్లా ఫౌండేషన్’ ప్రతీఏటా దేశంలోని 22 ప్రధాన భాషల్లో పద్య, వచన సాహిత్యంలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని అందజేస్తుంది. ఈ ఏడాదికి తెలుగులో కవి శివారెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. శివారెడ్డి రాసిన ’పక్కకు ఒత్తిగిలితే’ పద్య సంకలనానికి పురస్కారం లభించింది . ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా కవి శివారెడ్డి ఈ పురస్కారం అందుకున్నారు