‘‘రాగల 24 గంటల్లో’ సినిమా టీజర్ చాలా బావుంది. ఖచ్చితంగా ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతారు’’ అని అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో.. శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ పతాకంపై.. శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్నినిర్మించారు.సత్యదేవ్, ఇషా రెబ్బా నటించిన ఈ చిత్రానికి ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రల్లో చేసారు. దీపావళికి ఈ చిత్రం విడుదల అవుతోంది. ‘రాగల 24 గంటల్లో’ టీజర్ దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల అయ్యింది.
త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘‘రాగల 24 గంటల్లో’ సినిమా టైటిల్ బావుంది. టీజర్ చూసి నిజంగా చాలా థ్రిల్ ఫీలయ్యాను. రఘు కుంచె సంగీతం..కెమెరామేన్ అంజి వర్క్ బావుంది. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డికి..నిర్మాత శ్రీనివాస్ కానూరుకు ఆల్ ది బెస్ట్’’ అని చెప్పారు. ‘‘మా చిత్రం టీజర్ విడుదల చేసిన త్రివిక్రమ్ గారికి చాలా థ్యాంక్స్’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి,శ్రీనివాస్ కానూరు . ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబా అలీ, సంగీత దర్శకుడు రఘు కుంచె, కెమెరామేన్ ‘గరుడవేగ’ ఫేమ్ అంజి పాల్గొన్నారు.