వారికి ధైర్యం చెప్పేందుకు ముందుకు రావాలి!

మానసిక ఇబ్బందులు పడుతున్న వారికి అవగాహన కల్పించడంలో ఇంకా పురోగతి కనిపించాలి… అవగాహన కల్పించాలి …అని బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే అంటోంది. ‘మెంటల్‌ హెల్త్‌పై అవగాహన కల్పించేందుకు ఇటీవల చాలా కార్యక్రమాలు ప్రారంభమయినా కానీ, ఇంకా ఎక్కువగా అవగాహన కల్పించాల్సిన ఉంది. మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి ధైర్యం కలిగించేందుకు చాలా సంస్థలు ముందుకు రావాలి ‘ అని పేర్కొంది. దీపికా పదుకొనే మెంటల్‌ హెల్త్‌పై అవగాహన కల్పించేందుకు ‘లివ్‌ లవ్‌ లాఫ్‌’ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించింది. బాధితులకు ధైర్యం చెప్పేందుకు ఢిల్లీలో చర్చావేదికను ప్రారంభించింది. వివిధ విభాగాల నిపుణులు బాధితులతోనే నేరుగా చర్చించి ధైర్యం కల్పిస్తున్నారు.’లెక్చర్‌ సిరీస్‌’ అనే పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
దీపికా మాట్లాడుతూ… ‘మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న వారి దృష్టితో చూస్తే.. చాలా అవగాహన కల్పించాం. ఇంకా ఇందులో పురోగతి కనిపించాలి… అవగాహన కల్పించాలి. ఇప్పుడు అంతా బహిరంగంగా ఈ సమస్యపై చర్చించుకుంటున్నారు. ఇంతముందు ఇలా లేదు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో ‘లెక్చర్‌ సిరీస్‌’ కదలిక తీసుకొచ్చి..అవగాహన కల్పిస్తుంది. అందుకోసం వివిధ రంగాల్లోని వ్యక్తులను ఆహ్వానిస్తున్నాం. మెంటల్‌హెల్త్‌పై అవగాహన కల్పించాలని వారు బాధితులతో మాట్లాడి వాళ్ల పరిస్థితిని తెలుసుకుంటారు. వారి సమస్యకు తగ్గట్టు కౌన్సిలింగ్‌ ఇస్తారు” అని తెలిపింది.
 
నేను ఓ భార్యను కూడా కదా
‘ఇంత మతిమరుపు ఐతే ఎలా అమ్మ’ అంటూ నెటిజన్లు దీపికాను ఓ ఆట ఆట పట్టిస్తున్నారు.దీపికా పదుకోన్‌ నెటిజనుల చేతికి అడ్డంగా దొరికిపోయింది. డిప్రెషన్‌ పట్ల అవగాహన కల్పించడం కోసం దీపికా ‘లీవ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌’ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో నిర్వహించిన ‘లెక్చర్‌ సిరీస్‌’ కార్యక్రమానికి సోదరి అనిశా పదుకోన్‌తో కలిసి హాజరయ్యారు దీపికా పదుకోన్‌. మానసిక ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి చెప్పారు. గతంలో తాను కూడా డిప్రెషన్‌తో బాధపడినట్లు ఈ సందర్భంగా దీపికా వెల్లడించారు.
 
అక్కడ దీపికా మాట్లాడుతూ.. “నిజ జీవితంలో నేను ఎన్నో పాత్రలు పోషించాను. ఓ కుమార్తె, ఓ సోదరి, ఓ నటిగా” అని చెబుతూ తర్వాతి పదాల కోసం వెతుక్కుంటోంది. పక్కనే ఉన్న వారు అది గమనించి “ఓ భార్యగా” అని అందించారు. అప్పుడు దీపికా ‘ఆ ఓ భార్యగా’ కూడా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత “నేను ఓ భార్యను కూడా కదా..ఓరి దేవుడా ! ఆ విషయం నేను మర్చిపోయాను” అంటూ దీపికా నవ్వుకుంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీపికా-రణ్‌వీర్‌ల వివాహం గత నవంబర్‌లో జరిగింది.