ప్యాకేజి పారితోషికంతో హీరోలు భయపెడుతున్నారు!

స్టార్ హీరోలు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కొత్త కోరిక‌లు కోరుతున్నారు. ఏరియా రైట్స్ పోయి మొత్తం నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ అంటున్నారు. ఇప్పుడు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్‌కే మ‌రింత క్రేజ్ పెరిగింది. శాట్‌లైట్‌, డిజిట‌ల్, డ‌బ్బింగ్ ..ఇలా ఇక్క‌డ‌కే 50 కోట్లు వ‌స్తున్నాయి. అంటే ఇవ‌న్నీ క‌లిపి హీరోల జేబుల్లోకి వెళ్లిపోతే ఇక నిర్మాత‌లకు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు.నిర్మాత‌ల‌కు లాభాలు వ‌చ్చేది కేవ‌లం థియేట్రిక‌ల్ రైట్స్ లో మాత్రం. దీంతో ఒక్క హీరోనే ఇంత తీసుకుంటే మాకు మిగిలేది ఏంటి? మిగిలిన వాళ్ల‌కి ఏమి ఇవ్వాలి? అని నిర్మాతలు అడుగుతున్నారు.
 
రెమ్యునరేషన్ విషయమై టాలీవుడ్‌లో మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతోంది. ఇటీవలి కాలంలో మహేష్ తన సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోవడం మానేసి నాన్ థియేట్రికల్ రైట్స్‌ను చేజిక్కించుకోవడం మొదలు పెట్టాడట. ‘మహర్షి’ సినిమాకు కూడా మహేష్.. నాన్ థియేట్రికల్ రైట్స్‌ను రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడట. దీంతో ఆయనకు శాటిలైట్‌తో పాటు డిజిటల్ స్ట్రీమింగ్, ఆడియో తదితర హక్కులన్నీ కలిపి దాదాపు రూ.45 కోట్ల వరకూ వచ్చాయని టాక్.’మ‌హ‌ర్షి’ సినిమాకు ముగ్గురు నిర్మాత‌లన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు అటు మ‌హేష్ బాబు భారీ రెమ్యూన‌రేష‌న్.. ఇటు వంశీ వేస్ట్ ఖ‌ర్చుల‌తో బ‌డ్జెట్ పెర‌గ‌డం వ‌ల్ల వంద కోట్లు షేర్ వచ్చినా నిర్మాత‌ల‌కు ఏం మిగ‌ల‌లేదు.
ఇలా రెమ్యునరేషన్‌కు బదులు నాన్ థియేట్రికల్ రైట్స్‌ను తీసుకోవడం వల్ల మహేష్‌తో పాటు నిర్మాతకు కూడా కాస్త బడ్జెట్ విషయంలో కలిసి వస్తోందని అంటుంటే…..దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతలు అసంతృప్తి తో ఉన్నారట.ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’కి కూడా మహేష్ నాన్ థియేట్రికల్ రైట్స్‌ను రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్టు టాక్. దీంతో ఈ సినిమాకు మహేష్‌కు రూ.52 కోట్ల వరకూ ముట్టనున్నాయని సమాచారం. అనిల్ రావిపూడి సినిమాతో మహేష్..తన పారితోషికం విషయంలో నిజంగానే అంద‌రికి షాక్ ఇస్తున్నాడు. ఇప్పుడు మ‌హేష్‌తో సినిమా అంటేనే మిగిలిన నిర్మాత‌లు కూడా భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు మ‌హేష్‌ను చూసి బ‌న్నీ లాంటి వాళ్లు కూడా ఇదే రూట్లో వెళుతున్నార‌ట‌..