నాని-విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని ఇంటర్వ్యూ….
గ్యాంగ్ లీడర్ ఎలా స్టార్ట్ అయింది?
– విక్రమ్ నేను చాలా రోజులుగా రకరకాల ఐడియాస్ అనుకున్నాం. అలా ఒక రోజు ఈ ఐడియా గురించి చెప్పడం జరిగింది. నాకు బాగా నచ్చడంతో ఇమ్మిడియట్గా ఓకే చెప్పాను. అప్పటికి నేను ‘జెర్సీ’ షూటింగ్ స్టార్ట్ చేశాను. ఆ సినిమా షూటింగ్ అయిపోయేలోపు కథను ఇంకా డెవలప్ చేయమని చెప్పాను. అలా ‘జెర్సీ’ తరువాత వెంటనే ‘గ్యాంగ్ లీడర్’ స్టార్ట్ అయింది.
విక్రమ్ సినిమాలలో స్క్రీన్ ప్లే కాంప్లికేటెడ్‌గా ఉంటుంది కదా?
– నాకు తెలిసి విక్రమ్ అన్ని సినిమాల్లో లెస్ కాంప్లికేటెడ్ మూవీ ఇదే అని చెప్పొచ్చు. ట్విస్ట్‌లు టర్న్‌లు ఉన్నాసరే అవి అంత కాంప్లికేటెడ్ విషయాలు కావు. అలాగే విక్రమ్ అన్ని సినిమాల్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిలిం కూడా ఇదే.
మీ క్యారెక్టర్ గురించి?
– ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు పెన్సిల్ పార్థసారథి. పెన్సిల్ అనేది నా పెన్ నేమ్. చాలా పుస్తకాలు రాసిన అవి సేల్ అవ్వవు. అయినా చాలా పెద్ద రైటర్ అనేది వాడి ఫీలింగ్. ట్రైలర్లో చూపించిన దానికన్నా ఇంకా ఎక్కువ కామెడీ ఉంటుంది.
గ్యాంగ్ లీడర్ టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారు?
– అది విక్రమ్. నేను ‘జెర్సీ’ సినిమా కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నపుడు విక్రమ్ వచ్చి కలిసి ఒక టైటిల్ అనుకుంటున్నాను అని చెప్పారు. ఏంటి అంటే ‘గ్యాంగ్ లీడర్ ‘అన్నాడు. నాకు చాలా ఎగ్జైట్‌గా అనిపించి ఓకే అన్నాను.
ఈ సినిమాలో మీకు ఎగ్జైటెడ్‌గా అనిపించిన అంశాలేంటి?
– దాదాపుగా చాలా సినిమాల్లో చూసుకుంటే రివెంజ్ అనే కాన్సెప్ట్ చాలా వైలెంట్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద డైలాగ్స్, ఫైట్స్ ఉంటాయి. అయితే రివెంజ్ అనే కాన్సెప్ట్‌ని ఎంటర్టైనింగ్ వేలో చూపిస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. అలాగే ఒక ఐదుగురు ఆడవాళ్ళకి రివెంజ్ రైటర్‌గా ఉండడం ఇలా అన్ని పాయింట్స్ నన్ను ఎగ్జైట్ చేశాయి. రేపు థియేటర్స్ లో మిమ్మల్ని మరింత ఎగ్జైట్ చేస్తాయి.
విక్రమ్ ఈ కథ చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది?
– విక్రమ్ కథ చెప్పే విధానం చాలా ఫన్నీగా ఉంటుంది. అలాగే ఈ సినిమా కథ చెప్తున్నప్పుడు నేను ఎంజాయ్ చేసిన దాంట్లో ఆడియన్స్ సగం చేసిన సినిమా సూపర్ హిట్ అవుతుంది.
ప్రొడక్షన్ వాల్యూస్ గురించి?
– మైత్రి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అందరికి తెలుసు. వారు ఎన్నో గొప్ప చిత్రాలని నిర్మించారు. ఈ సినిమా విషయంలో కూడా బడ్జెట్‌కి ఎక్కడాకాంప్రమైజ్ కాకుండా బెస్ట్ అవుట్ ఫుట్ రావడానికి ఎంతో సహకరించారు.
‘ఓ బేబి’ తరువాత లక్ష్మి గారు మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నారు కదా?
అవునండి! సినిమాలో లక్ష్మీ గారు శరణ్య గారు అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో ఎంటర్టైన్ చేస్తారు. కొన్ని సీన్స్‌లో నా కామెడీ టైమింగ్‌కి వాళ్ళ కామెడీ టైమింగ్‌కి భలే సింక్ అయ్యింది. నిజానికి వాళ్ళే నాకు స్ట్రెంగ్త్ ఆ సన్నివేశాలను ప్రేక్షకులు థియేటర్స్‌లో బాగా ఎంజాయ్ చేస్తారు.
కార్తికేయతో నెగటివ్ రోల్ చేయించడానికి రీజన్?
– సినిమాలో కార్తికేయ చేసిన క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. విక్రమ్ వెళ్లి కథ చెెప్పినప్పుడు తను చేస్తాడా లేదా అనుకున్నాను. కానీ వన్స్ విక్రం వెళ్లి స్క్రిప్ట్ చెప్పి కార్తికేయ ఒకే అన్నాడు అనగానే హ్యాపీగా ఫీలయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్ రోల్ అది. ఎవరైనా హీరో చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే కొందరు హీరోలను ఆ క్యారెక్టర్ కోసం అనుకున్నాం. ఫైనల్‌గా కార్తికేయ చేసాడు. సినిమా రిలీజ్ తరువాత కచ్చితంగా ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడతారు.
అనిరుద్ మ్యూజిక్ గురించి?
– అనిరుద్ మ్యూజిక్ లో ఒక ఎనర్జీ ఉంటుంది. అందుకే ఈ సినిమా కోసం తనని తీసుకున్నాం. పైగా విక్రం కూడా అనిరుద్ తో సినిమా చేయాలనీ ఎప్పటి నుండో అనుకుంటున్నాడట. ‘జెర్సీ’ కి అనిరుద్ కరక్టేనా అని చాలా ఆలోచించాం కానీ ఈ సినిమాకు పెద్దగా డిస్కస్ చేయకుండానే పర్ఫెక్ట్ అనిపించి ఫైనల్ చేసేసాం.
‘జెర్సీ’ విజయంతో హ్యాపీగా ఉన్నారా?
– ‘జెర్సీ’ విషయంలో నేను ఎక్స్ట్రీమ్లీ హ్యపీ. తెలుగు సినిమాకు ఉన్న కొన్ని పరిధిలు దాటి మేము చేసిన ప్రయోగమది. వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ రైట్స్ ముప్పై కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అది. ఇప్పుడు అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్నారు. అందుకే ‘జెర్సీ’ నిజానికి థియేట్రికల్ రైట్స్ , రీమేక్ రైట్స్ , శాటిలైట్ రైట్స్ ఇప్పుడు చైనాలో రిలీజ్ అవుతుంది. ఇలా మేకర్స్‌కు ప్రాఫిట్ సినిమా అనిపించుకుంది.
మీరు బైలింగ్వల్ సినిమా చేసే అవకాశం ఉందా?
– ఇంతకు ముందు నేను బైలింగ్వెల్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసు. అందుకే నాకు బైలింగ్వెల్ అంటే భయం. అదిరిపోయే స్క్రిప్ట్‌తో మంచి సెటప్ కుదిరి అలాగే రెండు రాష్ట్రాలకు బాగుంటుంది. ‘అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి’ అంటేనే బైలింగ్వెల్ సినిమా చేస్తాను. అంతే కాని ‘ఇంకో చోట కూడా కలెక్షన్స్ వస్తాయి కదా’ అని బైలింగ్వెల్ చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్.
‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాలలో ఏది మీకు కష్టంగా అనిపించింది?
– జెర్సీ చిత్రం కొరకు మానసికంగా, శారీరకంగా చాలా కష్టపడాల్సి వచ్చింది, గ్యాంగ్ లీడర్ విషయంలో అలా కాదు. విక్రమ్ కుమార్ వలన గ్యాంగ్ లీడర్ షూటింగ్ స్మూత్ గా హ్యాపీ గా గడిచిపోయింది.
చిత్ర పరిశ్రమలో 11ఏళ్ల ప్రయాణం చేశారు,ఆ అనుభవం ఎలా ఉంది?
– 11ఏళ్ల సమయం ఎప్పుడైందో కూడా తెలియనంతగా కాలం గడిచిపోయింది. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఇన్నేళ్ళుగా నన్ను ఆదరిస్తున్న అభిమానులకు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నా..
నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
‘వి’ సినిమా రెండో షెడ్యుల్ ఈ నెల 15 నుండి థాయిలాండ్‌లో మొదలవుతుంది. నెక్స్ట్ మూడు సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్నాయి. అందులో నెక్స్ట్ ఏది అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ‘వి ‘ సినిమా తరువాతే వాటి గురించి ఆలోచిస్తాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు నేచురల్ స్టార్ నాని