అనన్య ప్రజంట్స్ పతాకం పై భూపాల్ ,అరుణ్ , ప్రియాంక ,సంజన హీరో హీరోయిన్స్ గా D రామకృష్ణ దర్శకత్వం లో రోపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాచిలర్ పార్టీ’. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ ను చిత్ర యూనిట్ లాంచ్ చేసారు .
ఈ సందర్భం గా దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ.. ఇది ఒక యాక్షన్ వెరైటీ .ఈ చిత్రం లో అన్ని కమర్షిల్ హంగులు ఉంటాయి. మా ప్రొడ్యూసర్స్ సుబ్బారావు శ్రీనివాస్ గార్లు చక్కటి సహకారం అందించారు.మా ఆర్టిస్టులు భూపాల్ , అరుణ్ , రమణారెడ్డి చక్కగా యాక్ట్ చేసారు.ఈ చిత్రాన్ని నవంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు .
హీరో అరుణ్ కురిటి మాట్లాడుతూ.. ఇది నా మొదటి చిత్రం డైరెక్టర్ గారి సహకారంతో చాల చక్కగా నటించాను . అలాగే భూపాల్ , రమణారెడ్డి నా కో ఆర్టిస్టులు గా చక్కని సహకారం అందించారు ఈ చిత్రం రిలీజ్ అయ్యి మంచి పేరు తెస్తుంది అని ఆశిస్తున్నాను అని అన్నారు .
ఇంకా ఈ కార్యక్రమం లో జబర్డస్ట్ నవీన్ , రైటర్ మాణిక్యలరావు కారేపల్లి తదితరులు పాల్గొన్నారు .
అరుణ్ కురిటి , భూపాల్ , ప్రియాంక , సంజన , గిరి , జబర్డస్ట్ మహేష్ , జబర్డస్ట్ నవీన్ ,చిత్రం శీను ,రమణ రెడ్డి , వెంకటేష్ గౌడ్ , శిరీష తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : ప్రమోద్ కుమార్ , DOP : ఆనంద్ మురళి రచన సహకారం : కారేపల్లి మాణిక్యాలరావు , రాజేష్ సవరపు
ప్రొడ్యూసర్స్ : సుబ్బారావు డి, శ్రీనివాస్ సంపంగి , రచన దర్శకత్వం : డి రామకృష్ణ