సినీవినోదం రేటింగ్ : 2/5
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్సు పై సుధీర్ వర్మ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధలోకి వెళ్తే… బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకునే దేవ (శర్వానంద్) హ్యాపిగా లైఫ్ లీడ్ చేస్తూంటాడు. అతనికో గర్ల్ ఫ్రెండ్ గీత (కళ్యాణి ప్రియదర్శన్). ఎంత కష్టపడినా బ్లాక్ టిక్కెట్లలో మిగిలేది తక్కువే. ఎలా డబ్బులు సంపాదించాలా అని ఆలోచిస్తున్న టైమ్ లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన మధ్యపాన నిషేధం కలిసి వస్తుంది. అప్పుడు ప్రక్క స్టేట్ ఒరిస్సా నుంచి లిక్కర్ స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదించటం మొదలెడతాడు. పాల క్యాన్ లో అడుగున దాచి తెచ్చిన లిక్కర్ లక్షలు తెచ్చిపెడుతుంది. అది యూజ్ యూజవల్ గా లోకల్ ఎమ్మల్యే సింహాచలం (మురళి శర్మ) చేసే దొంగ లిక్కర్ వ్యాపారానికి దెబ్బ కొడుతుంది.తన వ్యాపారానికి గండి కొడితే ఎమ్మల్యే ఊరుకుంటాడా..తన మనుష్యులతో దేవపై దాడి చేయిస్తాడు. అక్కడ నుంచి ఆ గొడవలు పెరుగుతూ పోతాయి. దానికి అంతం అనేది ఉండదు. చివరకు అటు సింహాచలం..ఇటు దేవ ఇద్దరూ తమ సొంత మనుష్యులను సైతం కోల్పోతారు. ఆ క్రమంలో సింహాచలం మాయమైపోతాడు. దేవా ..అన్ని వ్యాపారాలు కట్టి పెట్టి స్పెయిన్ లో సెటిల్ అవుతాడు. కానీ అతని గతం అతన్ని తిరిగి వెనక్కి పిలుస్తుంది.
వైజాగ్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. దాని కోసం దాదాపు 12 వేల మది పేదలు నివసించే స్థలాన్ని ఖాళీ చేయించాలని అనుకుంటాడు అజయ్. దాని కోసం మినిస్టర్(బ్రహ్మాజీ) సహాయం కోరుతాడు. అయితే 12 వేల మంది వెనుక దేవా(శర్వానంద్) ఉన్నాడని, అతన్ని ఒప్పించాల్సి ఉంటుందని తెలుసుకుంటాడు. అయితే దేవా స్పెయిన్‌లో తన కూతురితో కలిసి ఉంటాడు. పేదలను తరిమేసి అక్కడ ఎయిర్ పోర్ట్ కట్టాలనే ప్రతిపాదనకి దేవా అంగీకరించడు. దాంతో దేవా సెంట్రల్ మినిష్టర్ రంగంలోకి దిగుతాడు. అయితే దేవా మాఫియా దెబ్బకు అతను భయపడి వెనకడుగు వేస్తాడు. తన పని జరగాలంటే దేవా అడ్డు తొలగించుకోవాలని భావిస్తాడు అజయ్. అదే సమయంలో అతనికి దేవా పాత శత్రువు సింహాచలం తోడవుతాడు. సింహాచలం కనిపించకుండానే, దేవాపై ఎటాక్ చేసే ప్రయత్నాలు చేస్తాడు. ఓ ప్రయత్నంలో దేవా తీవ్రంగా గాయపడతాడు. చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్‌లో జాయిన్ అయిన దేవా తనపై ఎటాక్ చేసిందెవరో తెలుసుకోవాలనుకుంటాడు. చివరకు దేవా తన ప్రత్యర్థులను అంతం చేస్తాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..