‘పెళ్ళిచూపులు`, `మెంటల్ మదిలో` వంటి చిత్రాలను నిర్మించి సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకోవడమే కాదు..జాతీయ అవార్డ్, ఫిలింఫేర్ అవార్డులను సైతం చేసుకున్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ఇప్పుడు రాజ్ కందుకూరి నిర్మాతగా, ఆయన తనయుడు శివ కందుకూరి హీరోగా నటిస్తోన్న తొలి చిత్రానికి `చూసీ చూడంగానే` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా శేష సింధు రావు అనే మహిళా దర్శకురాలిని పరిచయం చేస్తున్నారు రాజ్ కందుకూరి. ఈమె క్రిష్ జాగర్లమూడి, సుకుమార్‌ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు.
ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజ్ కందుకూరి గత చిత్రాల్లాగానే ఈ చిత్రం కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ అసోసియేషన్‌లో విడుదలవుతుంది. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తుంది. తమిళంలో విజయవంతమైన `96` చిత్రంలో వర్ష హీరోయిన్‌గా నటించింది. నేషనల్ అవార్డ్ విన్నర్ గోపీసుందర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి `మెంటల్ మదిలో` కెమెరా మెన్ వేద రామన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు శివ కందుకూరి మరో మూడు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు.
నటీనటులు: శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ తదితరులు
సాంకేతిక వర్గం: డైరెక్టర్: శేష సింధు రావు
నిర్మాత: రాజ్ కందుకూరి, బ్యానర్: థర్మపథ క్రియేషన్స్
సమర్పణ: సురేశ్ ప్రొడక్షన్స్,
సంగీతం: గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: వేద రామన్
డైలాగ్స్: పద్మావతి విశ్వేశ్వర్, ఎడిటర్: రవితేజ గిరిజాల
Producer Raj Kandukuri’s son Shiva Kandukuri’s debut film ‘Choosi Choodangaane’
With ‘Pelli Choopulu’ and ‘Mental Madhilo’ Raj Kandukuri got a recognition as a successful producer and received National award and Filmfare award. Now Raj is launching a lady director Sesha Sindhu Rao who worked as assistant to directors Krish Jagarlamudi and Sukumar in the past. The film is getting ready for release in September and today Raj Kandukuri revealed the title of the film as ‘Choosi Choodangaane’ like Raj”s earlier films, this film will also release in association with the prestigious “Suresh Productions” banner.
This film also marks the debut of producer Raj Kandukuri’s son Shiva. ‘Choosi Choodangaane’ is a rom-com while Varsha Bollamma is being introduced as the female lead. Varsha acted in the critically acclaimed tamil film ’96.’Gopi Sundar is composing music for this film while Veda Raman of ‘Mental Madhilo’ fame handled the cinematography.It’s also learnt that Shiva Kandukuri is acting in 3 more films simultaneously.
Cast: Shiva Kandukuri, Varsha Bollamma
Crew: Director: Sesha Sindhu Rao
Producer: Raj Kandukuri, Banner: Dharmapatha Creations
Presents: Suresh Productions
Music:Gopi Sundar, Cinematography:Veda Raman, Dialogues:Padmavathi Visweswar, Editor:Raviteja Girijala