బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సౌత్ ఇండియా ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలైన హాట్ బ్యూటీ మల్లికా శెరావత్. ఈ అమ్మడు బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. దాదాపు దశాబ్దం క్రితం శృంగార తారగా బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపింది మల్లికా శెరావత్. ఒక దశలో బాలీవుడ్ హాట్ హీరోయిన్గా, ఐటెం సాంగ్‌ల స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. హలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. అయితే ఆ తర్వాత మల్లిక బాటలో చాలా మంది కొత్త భామలు రావడంతో ఆమె ఫేడ్ అవుట్ అయింది.అయితే ఈమధ్య కాలంలో మాత్రం ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. స్టార్డమ్ దక్కించుకున్నా కూడా తన దూకుడు స్వభావం కారణంగా చాలా సినిమాలను పోగొట్టుకోవాల్సి వచ్చిందని మల్లికా శెరావత్ తాజాగా చెప్పింది. తన 15 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి అయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
“నా స్వభావం రీత్యా నేను కాస్త ఎక్కువగా మాట్లాడేస్తాను. దాంతో చాలా మంది హీరోలు నన్ను వారి సినిమాల నుండి తీసేసిన సందర్భాలు ఉన్నాయి.నన్ను తొలగించి తమకు నచ్చిన హీరోయిన్లను సినిమాల్లో పెట్టుకున్నారు. అలా నేను 30 సినిమాల వరకు పోగొట్టుకున్నాను. నాకు ఎవరైనా అవకాశం ఇచ్చినా కూడా కొందరు హీరోలు ‘ఆమె ఎక్కువ మాట్లాడేస్తుంది.. ఆమెతో సినిమా చేయడం మంచిది కాదం’టూ దర్శకులకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో నేను నటీమణులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడితే ..నేను దేశం పరువు తీసినట్లుగా విమర్శలు చేశారు. నాకు దేశ భక్తి లేదన్నట్లుగా కొందరు నన్ను తిట్టారు. ఇక ప్రస్తుతం హీరోయిన్లకు ఉన్నంత స్వేచ్ఛ గతంలో లేదు. ప్రస్తుతం సినిమా పరిశ్రమ చాలా బాగుంది. ఇది గోల్డెన్ టైం”అని చెప్పింది.
చేయనని కచ్చితంగా చెప్పేసా !
మల్లికా శెరావత్ ప్రస్తుతం నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న `బూ.. సబ్కీ ఫటేగీ` చిత్రంలో నటిస్తోంది.ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా `ది కపిల్ శర్మ షో` కార్యక్రమంలో నిర్మాత ఏక్తాతో కలిసి మల్లిక పాల్గొంది. ఈ సందర్భంగా గతంలో ఒక సినిమా షూటింగ్ సమయంలో తానెదుర్కొన్న ఇబ్బంది గురించి చెప్పింది….
`గతంలో నేనెదుర్కొన్న సంఘటన చెప్పాలనుకుంటున్నా. ఓ సినిమాలో నా నడుము భాగాన్ని బాగా హైలైట్ చేయాలనుకున్నారు. అందుకోసం ఓ వికృత సన్నివేశానికి రూపకల్పన చేశారు. నా పొట్టపై కోడిగడ్లు పెట్టి ఓ హాట్ సన్నివేశాన్ని తెరకెక్కించాలనుకున్నారు. నేను ఎంత హాట్‌గా ఉన్నానో ఆ కోడిగుడ్లు వేయించడం ద్వారా చూపించాలన్నది వారి ఆలోచన . ఈ సీన్ గురించి నిర్మాత నాకు వివరించారు. అలాంటి సీన్లో నేను చేయనని కచ్చితంగా చెప్పేశాన`ని మల్లిక వెల్లడించింది. అలాగే చాలా సినిమాల నుంచి తనను తప్పించి ఆ స్థానంలో పలువురు హీరోలు తమ ప్రియురాళ్లకు అవకాశాలు ఇచ్చుకునేవారని తెలిపింది. అలాగే మల్లికను ఎలా చూపించాలో చాలా మంది బాలీవుడ్ దర్శకులకు తెలియలేదని చెప్పింది.