బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ‘కబీర్ సింగ్’ చిత్రంతో మరో పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ ప్రారంభంలో ‘ఎం.ఎస్.ధోని’ చిత్రంతో మంచి సక్సెస్‌ను అందుకున్న ఈ భామ టాలీవుడ్లో మహేష్ ‘భరత్ అనే నేను’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను దక్కించుకుంది. ఇక ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్‌గా తెరకెక్కిన ‘కబీర్‌సింగ్’ చిత్రంఅప్పుడే వంద కోట్ల క్లబ్లో చేరడం విశేషం. ఈ చిత్రంతో కియారా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది.
అయితే బాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఏడాదికి ఒక సౌత్ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నానని ఈ భామ వెల్లడించింది. సహజంగా చాలామంది హీరోయిన్లు మొదట సౌత్ సినిమాలలో నటించి బాలీవుడ్లో బిజీ కాగానే సౌత్ సినిమాలను పట్టించుకోరు. కానీ వారికి భిన్నంగా కియారా మాత్రం ఏడాదికి ఒక సౌత్ సినిమా చేస్తానని హామీ ఇవ్వడం ఇక్కడి ప్రేక్షకులను సంతోషపెట్టే విషయమే. ప్రస్తుతం కియారా ‘గుడ్ న్యూస్’, ‘లక్ష్మి బాంబ్’, ‘షేర్ షా’, ‘ఇందూ కి జవానీ’ సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్లో బిజీగా ఉంది.
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై మొగ్గు
గిల్టీగా ఫీల్ అవుతోంది కియారా అద్వానీ. అంత తప్పేం చేసిందీ? అనుకోవద్దు. కియారా ఏ తప్పూ చేయలేదు. మరి గిల్ట్ ఎందుకు అంటే ‘గిల్టీ’ పేరుతో ‘నెట్‌ఫ్లిక్స్’ కోసం ఆమె ఓ సినిమా చేయబోతోంది. ఆల్రెడీ ‘లస్ట్ స్టోరీస్’తో డిజిటల్ ప్లాట్ఫామ్లో బోలెడంత క్రేజ్ తెచ్చుకుంది కియారా. అందులో చాలా బోల్డ్‌గా నటించింది. మరి.. ‘గిల్టీ’లో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో చూడాలి. రుచి నరైన్ దర్శకత్వం వహిస్తారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కియారా లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇది సరే కానీ కియారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై మొగ్గు చూపుతోంది కదా.. చేతిలో సినిమాలు లేవా? అంటే… అదేం కాదు. ప్రస్తుతం సౌత్‌లోనూ సినిమాలు చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నారు