బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. 53 ఏళ్ల వయసులో ఉన్నా సల్మాన్ పెళ్లి వార్తలు ఇప్పటికీ బాలీవుడ్లో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. గత ఏడాది కూడా రొమేనియన్ బ్యూటీ లూలియాను సల్మాన్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. తర్వాత ఆ ఊసు లేదు. ఈ క్రమంలో మరోసారి సల్మాన్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. ‘ముంబై మిర్రర్’కిచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్‌ను పెళ్లి గురించి ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పారు సల్మాన్…. ‘నాకు పిల్లలంటే చాలా ఇష్టం. కానీ వారితో పాటు తల్లి కూడా వస్తుంది. నాకు తల్లి వద్దు.. పిల్లలు మాత్రమే కావాలి. వారిని భద్రంగా చూసుకోవడం కోసం ఓ గ్రామాన్నే సిద్ధం చేసి ఉంచాను’ అన్నారు సల్మాన్.
మరి పెళ్లి అంటే.. దానికి ఇంకాస్త టైం ఉందని తెలిపారు సల్మాన్. ఈ ఇంటర్వ్యూ తర్వాత సల్మాన్ సరోగసికి సిద్ధమవుతున్నారనే వార్తల ప్రచారం ఎక్కువయ్యింది. తన స్నేహితులు షారూఖ్, ఆమిర్ బాటలోనే సల్మాన్ వెళ్తున్నారని.. సరోగసి విధానం ద్వారా ఆయన తండ్రి అవుతాడనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే …ప్రస్తుతం సల్మాన్ ‘భారత్’ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. రంజాన్ సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ సినిమా కోసం తొలుత ప్రియాంక చోప్రాను తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ నిక్ జోనాస్‌తో వివాహం నేపథ్యంలో ప్రియాంక ఈ చిత్రం నుంచి తప్పుకుంది. తర్వాత ఆమె స్థానంలో కత్రినా వచ్చారు.
నేను కేవలం రివార్డులే కోరుకుంటా !
జాతీయ అవార్డులపై బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తి వారిని అలరించడమే తనకు ఇష్టమని అవార్డులపై ఆశ లేదని ప్రేక్షకుల రివార్డులే తనకు ముఖ్యమని సల్మాన్ స్పష్టం చేశారు. మీకు ఇంతవరకూ జాతీయ అవార్డులు ఎందుకు రాలేదని ప్రశ్నించగా, తాను కేవలం రివార్డులే కోరుకుంటానని, నా సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్‌కు వెళితే తనకు నేషనల్ అవార్డు దక్కినట్టేనని చెప్పుకొచ్చారు.
దేశం మొత్తం తన సినిమాను చూడటమే తనకు అతిపెద్ద రివార్డ్ అన్నారు. ఆరు ఫైట్లు, నాలుగు పాటలతో సినిమాను రక్తికట్టించే తరహాలో రూపొందే సినిమాలతో సల్మాన్‌కు నేషనల్ అవార్డులు ఎలా వస్తాయని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే రుస్తుం మూవీతో అక్షయ్ కుమార్‌కు జాతీయ అవార్డు లభించడంతో సల్మాన్ అభిమానులు సైతం తమ హీరోకు రివార్డులతో పాటు అవార్డులూ దక్కాలని ఆశిస్తున్నారు.