ఒక జంట…ఒక హీరో-ఒక హీరోయిన్ కలిసి రెండు భాషల్లో నటించిన సినిమాలు రెండూ, ఒకే రోజున విడుదల కావడమనేది చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన సంఘటన ఇప్పుడు తమన్నా – ప్రభుదేవా విషయంలో జరుగుతోంది. తమిళంలో తమన్నా – ప్రభుదేవా కలిసి ‘దేవి 2’ ( అభినేత్రి 2) సినిమా చేశారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక తమన్నా – ప్రభుదేవా కాంబినేషన్లో హిందీలో ‘ఖామోషి’ హారర్ సినిమా నిర్మితమైంది. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 31వ తేదీనే విడుదల చేయనున్నారు. ఇలా తమన్నా – ప్రభుదేవా కలిసి చేసిన సినిమాలు రెండు, ఒకే రోజున ప్రేక్షకులను పలకరించనుండటం నిజంగా విశేషమేనని చెప్పుకోవాలి.