దక్షిణాదిలో తమిళ చిత్ర రంగం రెమ్యూనరేషన్ విషయంలో అందరిని మించి పోతోంది. అజిత్ తాను నటించనున్న కొత్త చిత్రానికి రూ.60 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం. తమిళ చిత్రాలకి ఓవర్సీస్ బిజినెస్ భారీగా జరగడం వారికి కలిసొచ్చే విషయం.
అగ్రహీరోలు ఒక్కొక్క చిత్రానికి రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటారు అన్న విషయంపై అభిమానులతో పాటు అటు సినీవర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంటుంది. అయితే ఈ విషయం ఖచ్చితంగా నిర్మాతకు, ఆడిటర్, ఇన్‌కమ్‌టాక్స్ అధికారులకు మాత్రమే తెలుస్తుంది. తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్‌హాసన్, అజిత్, విజయ్‌ల రెమ్యూనరేషన్ అటుఇటుగా రూ.40 నుంచి రూ.50 కోట్ల వరకు వుండవచ్చని కోలీవుడ్ వర్గాల సమాచారం. వారి సినిమాలు వారంలోనే వంద కోట్లు వసూళ్లు దాటేస్తున్నాయి.ఆ హీరోల చిత్ర విజయాలను, కలెక్షన్, టోటల్ బడ్జెట్‌ను బట్టి కూడా రెమ్యూనరేషన్ మారుతుంది.
వరుసలో నాలుగు బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన అజిత్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసుకుందామని వారి అభిమానులు చాలా ఆసక్తిగా వున్నారు. ‘విశ్వాసం’ చిత్రం తరువాత బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ‘నేర్కొండ పార్వై’ చిత్రానికి భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అజిత్ తాను నటించనున్న కొత్త చిత్రానికి రూ.60 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం.
మన తెలుగులో ప్రభాస్ అందరు హీరోలకన్నా ఎక్కువ (50 కోట్ల వరకూ) తీసుకుంటున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి హీరోలు 25 నుండి 30 కోట్లు తీసుకుంటున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ వారి తర్వాత వరుసలో ఉన్నారు. వారి తర్వాత విజయ్ దేవరకొండ ఉన్నారు.