శర్వానంద్ ముగ్గురు కొత్త దర్శకులతో ట్రావెల్ చేయనుండడం విశేషంగా మారింది.ప్రస్తుతం యువ హీరోలంతా వైవిధ్యమైన కథలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఎవరు కొత్త పాయింట్ చెప్పినా వాళ్ళను దర్శకుడిగా పరిచయం చేయడానికి వెనుకాడడం లేదు. అలాంటి హీరోల్లో శర్వానంద్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. శర్వానంద్ కెరీర్‌ను బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సుధీర్ వర్మ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంటే… ఆ తర్వాత వరుసగా ముగ్గురు కొత్త దర్శకులతో అతను ట్రావెల్ చేయనుండడం విశేషంగా మారింది
సుధీర్‌వర్మ సినిమాతో పాటు శర్వానంద్ నటిస్తోన్న చిత్రం ’96’ రీమేక్. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ చేస్తున్న ఈ సినిమా రీసెంట్గా లాంచ్ అయింది. ప్రస్తుతం కెన్యాలో షూటింగ్ జరుపుకుంటోంది . ఈ సినిమా సెట్స్ మీదుండగానే మరో ఇద్దరు కొత్త దర్శకులకు శర్వా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట.
శర్వానంద్ 14రీల్స్ పతాకంపై ఓ కొత్త డైరక్టర్‌తో సినిమా ఒకే చేశాడట . ఆ మూవీని సంక్రాంతికి రెడీ చేయాలని కచ్చితంగా చెప్పేశాడని వార్తలు వస్తున్నాయి. ఇదికాక తమిళ-తెలుగు భాషల్లో తమిళ నిర్మాత ఫ్రభు సినిమాకు ఓకే చెప్పేడట. దానికి కూడా ఓ కొత్త దర్శకుడే పనిచేస్తాడని టాక్. మొత్తానికి కొత్త దనానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న శర్వానంద్ ని ఈ మూడు చిత్రాలూ ఏ మలుపు తిప్పుతాయో చూడాలి.