“నేనిప్పటి వరకు చేసిన పాత్రలతో పోల్చితే ‘భారత్’లోని పాత్ర నన్ను ఎంతగానో ఇన్‌స్పైర్ చేసింది. ఈ పాత్ర ఓ సరైన నటిని ఎంచుకుంది’ అని అంటోంది కత్రినా కైఫ్. సల్మాన్ సరసన కత్రినా కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘భారత్’. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది. తొలుత కుముద్ రైనా పాత్రకి ప్రియాంక ఎంపికయ్యారు. ఆమె అర్థంతరంగా తప్పుకోవడంతో కత్రినాని ఎంపిక చేసిన విషయం విదితమే. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కత్రినా పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది….
‘నా పాత్ర 1975కి చెందిన మహిళది. రియల్ లైఫ్ రోల్‌మోడల్ ఆధారంగా నా పాత్రని దర్శకుడు అలీ డిజైన్ చేశారు. ఇందులో మొదట ప్రియాంకని అనుకున్నారు. కానీ కుముద్ పాత్రకి నేనే రైట్ పర్సన్ అని తర్వాత అర్థమైంది. పాత్ర కోసం రెండు నెలలు ప్రిపేర్ అయ్యా. సల్మాన్‌తో నాకు గ్రేట్ కెమిస్ట్రీ ఉంది. కానీ ఈ సెట్‌లోకి వచ్చినప్పుడు స్క్రిప్ట్ విభిన్నమైన నటనని కోరుకుంటుందని అర్థమైంది. దీంతో సల్మాన్‌తో ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అయ్యింది. ఇందులో నా పాత్ర రెండు భిన్న పార్శ్వాలను ప్రతిబింబిస్తుంది. నేను ఏ పాత్ర చేసినా అది రియల్ లైఫ్‌కి దగ్గరగా, ఎక్కడో చూసినట్టుగా ఉండేలా చూసుకుంటాను. ఇక ప్రేమలో బ్రేకప్‌కి ముందు నన్ను నేను రీబిల్డ్ చేసుకున్నా. జరిగిన దాన్నుంచి పూర్తిగా బయటపడాలనుకున్నాను. మరింత బాధత్యగా ఫీలయ్యాను. అయితే నేను చాలా ఎమోషనల్. సున్నితమైన మనస్థత్వం నాది. అయినప్పటికీ ఎవరికోసమో నేను మారాలనుకోలేదు, ఏదీ వదులు కోవాలనుకోలేదు. ఒక మహిళగా నేను భద్రతాభావంలో ఉండాలనుకున్నా, అదే సమయంలో నాకంటూ ఓ గుర్తింపుని ఏర్పర్చుకోవాలనుకున్నా. ఆ దిశగా ముందుకు సాగుతున్నా’ అని తెలిపింది.
నేనే నిర్మాతగా మారబోతున్నా!
‘ఎన్‌హెచ్ 10’, ‘పరీ’ వంటి విభిన్న చిత్రాలతో అనుష్కశర్మ, యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘ఛపాక్’ తో దీపికా పదుకునే నిర్మాతలుగా మారిన విషయం తెలిసిందే. కాగా వీరి బాటలోనే మరో క్రేజీ కథానాయిక కత్రినా కైఫ్ నిర్మాతగా మారుతూ కొత్త అడుగు వేయబోతోంది. ఓ కథ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. దాన్ని తెరపైకి తీసుకురావడానికి నేనే నిర్మాతగా మారబోతున్నాను. త్వరలోనే ఓ ప్రొడక్షన్ కంపెనీకి శ్రీకారం చుట్టబోతున్నాను అని తెలిపింది కత్రినా. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న భారత్, అక్షయ్‌కుమార్ హీరోగా రోహిత్ శెట్టి రూపొందిస్తున్న ‘సూర్యవన్షీ’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాల తరువాత నిర్మాతగా కత్రినా కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నదట.