సంచలనాలకి కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే కంగనా రనౌత్ ఇటీవల ‘మణికర్ణిక’చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కంగనా నటనకి ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రస్తుతం తాను జయలలిత బయోపిక్‌లో నటించేందుకు సిద్దమైంది. ‘తలైవి’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని విజయ్ తెరకెక్కించనున్నాడు. విబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. మరి కొద్ది రోజులలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ,భాషలలో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది జయలలిత. అమ్మగా, ‘పురుచ్చతలైవీ’గా అభిమానులతో పిలిపించుకున్న జయలలిత భారత రాజకీయాలలోను ముఖ్య భూమిక పోషించింది. దాదాపు 14 సంవత్సరాలకి పైగా తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలని నిర్వర్తించింది.
అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యారట!
ప్రస్తుతం కోలీవుడ్‌లో జయలలిత జీవిత నేపథ్యంలో బయోపిక్‌లు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తమిళంలో ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జయలలిత బయోపిక్ రూపొందిస్తున్నారు. నిత్యామీనన్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, పేపర్ టేల్ పిక్చర్స్ చిత్రాన్ని నిర్మిస్తుంది.ఇక రీసెంట్గా తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తాను ‘తలైవీ’ అనే టైటిల్‌తో జయలలిత బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించాడు. విబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇందులో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు కంగనా రనౌత్ 24 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట. కంగనాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఆమెకి అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యారని టాక్. తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.