ప్రభాస్ కోసం స్పెషల్ సాంగ్ లో కాజల్

ప్రభాస్ హీరోగా రూపొందిన ‘మిస్టర్ పర్ ఫెక్ట్’, ‘డార్లింగ్’ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్  డార్లింగ్ ప్రభాస్ కోసం రంగంలోకి దిగబోతోందని తెలుస్తోంది. స్పెషల్ రోల్ తో పాటు స్పెషల్ సాంగ్ కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా ఓ షెడ్యూల్ యూరోప్ లో జరిగింది. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లో ప్రభాస్ పాల్గొనగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 16 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డె కథానాయికగా నటిస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ కీలక పాత్ర పోషించబోతున్నారు. కాగా కాజల్ అగర్వాల్ ని ఈ సినిమాలో స్పెషల్ రోల్ తో పాటు స్పెషల్ సాంగ్ చేయించడానికి తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఈ స్పెషల్ సాంగ్ లో కాజల్ ఈ చిత్రానికే హైలెట్ కానుందట.
ప్రేమ యుద్ధం చేయడానికి రెడీ !
‘సాహో’ కోసం ఆయుధాలతో సావాసం చేసిన హీరో ప్రభాస్‌ ఇప్పుడు ప్రేమ యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రభాస్‌ హీరోగా ‘జిల్‌’ ఫేమ్‌ రాధా కృష్ణకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. 1970లో సాగే ప్రేమకథతో ఈ చిత్రం ఉంటుంది, ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ఇటలీలో జరిగింది.ఇప్పుడు రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్‌ దాదాపు 20 రోజుల పాటు సాగుతుందట.
 
ఇందుకోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ 1970 నాటి కాలం ప్రతిబింబించేలా సెట్‌ను తయారు చేశారని తెలిసింది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. ‘సాహో’ చిత్రం ఈ ఏడాది పంద్రాగస్టుకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ శ్రద్ధాకపూర్‌ కథానాయిక.