“మన జీవితాన్ని విధి నిర్ణయించేస్తుంద”ని నటి పూజాహెగ్డే అంటోంది. “విధి గురించో, ఇతర విషయాల గురించో నాకు పెద్దగా తెలియదు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించలేను. ఒక చిత్రంలో నటించడానికి అంగీకరించినప్పుడు అందులో పాత్ర కోసం ఏమేం చేయాలన్నది దర్శకుడు ముందుగానే డిజైన్ చేసి ఉంటారు. దాన్ని చక్కగా నటించాలంతే. ఈ లోకంలో జన్మించిన నేను ఏం చేయాలన్నది కూడా విధి నిర్ణయించేసి ఉంటుంది. దాన్ని చేస్తున్నాను. పెద్ద విజయమో, చిన్న విజయమో, లేక అపజయమో మనలో చాలా మార్పు తీసుకొస్తుంది. చాలా అనుభవాలను అందిస్తుంది. అందులోంచి పాఠం నేర్చుకుని మనం ఏంటో అర్థం చేసుకోగలం. అయితే ఏదేమైనా నేను అదృష్టవంతురాలిననే చెప్పాలి” అని పూజాహెగ్డే పేర్కొంది.గ్లామర్ విషయంలో హద్దులుగానీ, షరతులు గానీ విధించని పూజాహెగ్డే కెరీర్ ఇంకా జోరు అందుకోవలసి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుందో ఏమో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమ్మడు కాస్త విరక్తితో కూడిన వేదాంత ధోరణిలో తనేంటో తనకు తెలుసు అన్నట్టుగా ఇలా మాట్లాడింది.
‘ముగముడి’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే ఆ తరువాత కోలీవుడ్‌లో కనిపించలేదు. ఆ చిత్రం విజయం సాధించలేదు. అయితే టాలీవుడ్ మాత్రం ఆమెని బాగానే రిసీవ్ చేసుకుంది. ముకుంద, దువ్వాడ జగన్నాథమ్ వంటి చిత్రాలు పూజాహెగ్డేకు మంచి పేరే తెచ్చి పెట్టాయి. జూనియర్ ఎన్‌టీఆర్‌తో నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం కూడా హిట్ అనిపించుకోవడంతో అమ్మడిది ‘లక్కీహ్యాండ్’ అని టాక్ వచ్చింది. అలాగే చాలా మంది స్టార్ హీరోయిన్ల లానే ‘రంగస్థలం’ చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు ఆడేసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజాహెగ్డే వరుస ఆఫర్లతో బిజీగా ఉంది.పూజాహెగ్డే నటిగా ఎంట్రీ ఇచ్చి ఏడేళ్లవుతున్నా, ఇప్పుటికి 8 చిత్రాలే చేసింది. ప్రస్తుతం హిందీలోనూ ఒక చిత్రం చేస్తోంది. మహేశ్‌బాబుతో ‘మహర్షి’ చిత్రంలో నటిస్తోంది.
అప్పుడు ఈజీగా ఇంప్రెస్ అయిపోతా!
వెండి తెర పై జిల్ జిల్ జిగేల్ మనిపిస్తున్న పూజా హెగ్డే ప్రస్తుతం మహేశ్ సరసన ‘మహర్షి’లో నటిస్తోంది. ఫుడ్, ట్రావెలింగ్ ఎక్కువగా ఇష్టపడతానన్న ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది…. ‘‘నన్ను ఎవరన్నా ఇంప్రెస్ చేయాలంటే ఒకటి.. ఇష్టమైన ఫుడ్ పెట్టాలి. రెండోది మంచి క్యాండిల్ లైట్ డిన్నర్‌కి తీసుకెళ్లాలి. అప్పుడు ఈజీగా ఇంప్రెస్ అయిపోతా. కొందరి ప్రేమను గెలవాలంటే కొన్నిసార్లు కాంప్రమైజ్ కావాలి. నేనూ అలా అయిన సందర్భాలున్నాయి. ఓ అబ్బాయికి నేను ఎట్రాక్ అవ్వాలంటే వారిలో వినయం, ఇంటెలిజెన్స్ ఉండాలి. హీరోయిన్ కాకపోతే.. ఫ్యాషన్ స్టైలింగ్, ఫొటోగ్రఫీ వైపు వెళ్లేదాన్ని. బయటకు వెళ్లేప్పుడు లో దుస్తులు, ఫోన్, కళ్లజోడు తప్పకుండా ఉపయోగిస్తా. నాలో నాకు ప్లస్ అనిపించేది నా హైట్, తర్వాత నా పెదాలపై సన్నని నవ్వు’’ అని చెప్పింది.