ఆదిత్య అల్లూరి, అనికా రావు జంటగా లక్ష్మి చలన చిత్ర పతాకంపై వివేక్ వర్మ దర్శకత్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తోన్న చిత్రం `స్వయంవద`. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన నిర్మాత సి. కళ్యాణ్ టీజర్ ఆవిష్కరించారు.
అనంతరం సి. కళ్యాణ్ మాట్లాడుతూ,` మోషన్ పోస్టర్, టీజర్ బాగున్నాయి. ఇటీవల కాలంలో హారర్ జోనర్ సినిమాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా. అలాగే ఇదే టీమ్ భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నా` అని అన్నారు.
మరో నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, స్వయం వద టీజర్ ప్రామిసింగ్ గా ఉంది. టీజర్ చూస్తుంటే మేకింగ్ బాగుందనిపిస్తోంది. కెమెరా పనితనం బాగుంది. ప్రస్తుతం హారర్ కామెడీ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఆ కోవలో ఈ సినిమా కూడా చక్కని విజయం సాధించాలి` అని అన్నారు.
హీరో ఆదిత్య అల్లూరి మాట్లాడుతూ, ` టీజర్ చూస్తే మా కష్టం కనిపిస్తుంది. దర్శక, నిర్మాతలిద్దరూ ఎక్కడా రాజీ పకుండా సినిమా చేసారు. స్టోరీ బేస్ట్ సినిమా ఇది. సీనియర్ నటులతో కలిసి పనిచేయడం మంచి ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చింది` అన్నారు.
హీరోయిన్ అనికా రావు మాట్లాడుతూ, ` ఇందులో మొత్తం ఆరు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తా. ఛాలెంజింగ్ గా అనిపించింది. మంచి కోస్టార్స్ కుదరడం వల్లే ఆ పాత్రల్లో ఒత్తిడి లేకుండా నటించగలిగాను. డైరెక్టర్ ప్రతీ సన్నివేశాన్ని చక్కగా ఆవిష్కరించారు` అని అన్నారు.
దర్శకుడు వివేక్ వర్మ మాట్లాడుతూ, ` హారర్ , థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, సస్పెన్స్ అంశాల చుట్టూ కథ నడుస్తుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఆరేళ్ల వయసున్నవారి నుంచి 60 ఏళ్ల వయసు గల వరకూ అందరూ కలిసి చూడదగ్గ సినిమా. అసభ్యకర సన్నివేశాలు ఎక్కడా ఉండవు. క్లీన్ ఎంటర్ టైనర్. కథను నమ్ముకుని చేసాం. మా ప్రయత్ననాన్ని తెలుగు ప్రేక్షకులంతా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
నిర్మాత రాజా దూర్వాసుల మాట్లాడుతూ, ` సినిమా బాగా వచ్చింది. సాంకేతిక పరంగాను హైలైట్ గా ఉంటుంది. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని మా సినిమా ఇస్తుంది. నటీనటులంతా చక్కగా నటించారు. దర్శకుడి పనితనం ప్రశంసనీయం. త్వరలో విడుదల కాబోతున్న మా సినిమాని తెలుగు ప్రేక్షకులంతా ఆదరిస్తారని ఆశిస్తున్నా` అని అన్నారు.
లోహిత్ మాట్లాడుతూ, ` నేను పోషించిన పాత్రకు ప్రకాష్ రాజ్ లాంటి నటుడైతే బాగుంటుందని దర్శకుడి చెప్పా. కానీ ఆయన నన్ను నమ్మి బరువైన బాధ్యత నా మీద పెట్టారు. బాగా చేసానని అనుకుంటున్నా. అప్ కమింగ్ ట్యాలెంట్ ను కూడా ఎంకరేజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు.
రామ్ జగన్ మాట్లాడుతూ, ` కథ బాగుంది. మంచి నటీనటులు కుదిరారు. కొత్త వారు అయినప్పటికీ చక్కగా నటించారు. టెక్నికల్ గాను సినిమా హైలైట్ గా ఉంటుంది` అని అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, ` హారర్, థ్రిల్లర్, కామెడీ జోనర్ చిత్రాలను ప్రేక్షకులు ఎప్పడూ ఆదరిస్తారు. కంటెంట్ బాగుంటే స్టార్ ఇమేజ్ లేకుండా సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఈ సినిమా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్లు అనిపిస్తోంది. కొత్త వాళ్లతో పాటు సీనియర్లు అయిన రామ్ జగన్, లోహిత్ కూడా నటిస్తున్నారు. టీజర్ బాగుంది. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలి` అని అన్నారు.
ఈ చిత్రంలో అర్చనా కౌడ్లీ, పోసాని కృస్‌న మురళి, ధన్ రాజ్, సారికా రామచంద్రరావు, రాంజగన్, లోహిత్ కుమార్, ఆనంద చక్రపాణి, ఆర్తి మోహ్ రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత కల్ప, సోనీ హేమంత్ మీనన్, బెంగుళూరు శివానీ, బేబి శ్రీశేష నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: మోహన్ జిల్లా, కెమెరా: వేణు మురళీధర్.వి, సంగీతం: రమణ.జీవి, ఎడిటింగ్: సెల్వ కుమార్, కథ,మాటలు, కథనం, దర్శకత్వం: వివేక్ వర్మ, నిర్మాత: రాజా దూర్వాసుల