`ప్రేమెంత ప‌నిచేసే నారాయణ`కు మంచి టాక్ !

హ‌రికృష్ణ‌, అక్షిత జంట‌గా జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో జెఎస్ ఆర్ మూవీస్ ప‌తాకంపై సావిత్రి జొన్న‌ల‌గ‌డ్డ నిర్మంచిన `ప్రేమెంత ప‌నిచేసే నారాయణ` ఈనెల 22న విడుద‌లై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో హీరో హ‌రికృష్ణ మాట్లాడుతూ, `తొలి షోతోనే సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ బాగుంది. మంచి రివ్యూలు వ‌చ్చాయి. అంతా హ‌రి బాగా చేసాడంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. న‌ట‌న‌, డాన్సులు, డైలాగులు బాగా చెప్పాడ‌ని క్రిటిక్స్ నుంచి సైతం ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇవ‌న్నీ నాకు మంచి బ్ల‌స్సింగ్స్. మొద‌టి సినిమాతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. షూటింగ్ స‌మ‌యంలో నా టీమ్ అంతా స‌పోర్ట్ గా ఉంది. స‌మిష్టి గా ప‌నిచేసాం. రిలీజ్ క ముందు సోష‌ల్ మీడియాలో మంచి పాజిటివ్ బ‌జ్ క్రియేట్ అయింది. అది మా సినిమాకు బాగా క‌లిసొచ్చింది. ఇలాంటి సినిమాకు మ‌రిన్ని థియేట‌ర్లు దొరికితే బాగుండేది` అని అన్నారు.
 
అక్షిత మాట్లాడుతూ, ` రిలీజ్ కు ముందే కాన్పిడెంట్ గా ఉన్నాం. మా న‌మ్మ‌కాన్ని ప్రేక్ష‌కులు నిల‌బెట్టారు. అందుకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు. సినిమాకు మంచి రివ్యూలు కూడా వ‌చ్చాయి. అవి మ‌రింత‌గా క‌లిసొచ్చాయి. కొత్త వాళ్లని ఇలాగే ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
 
ద‌ర్శ‌కుడు జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ, ` ఎదురు లేని మ‌నిషి`, `మా అన్న‌య్య బంగారం`, `బంగారు బాబు`,` జ‌గ‌ప‌తి` ఇలా చాలా సినిమాలను డైరెక్ట్ చేసాను. స్టార్ హీరోలు నాగార్జున‌, జ‌గ‌ప‌తిబాబు, బాల‌కృష్ణ, రాజ‌శేఖ‌ర్, శ్రీకాంత్ గారితో చేసాను. కోడైరెక్ట‌ర్ గా ఎన్నో సినిమాల‌కు ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. కానీ ఈ క‌థ కొత్త వాళ్ల‌తో చేస్తే నే బాగుంటుంద‌ని చేసా. అందుకే మా అబ్బాయిని హీరోగా పెట్టి చేసా. నేను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా చేసా. సినిమా చూసిన వారంతా హ‌రి బాగా చేసాడ‌ని ఫోన్లు చేసి చెబుతున్నారు. ఇండ‌స్ర్టీలో ఉన్న స‌న్నిహితులు కూడా హ‌రి డాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ చ‌క్క‌గా చేసాడ‌ని మెచ్చుకున్నారు. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఎంతో బాగుంది. క్రిటిక్స్ సైతం ప్ర‌శంసించారు. మంచి రివ్యూలు ఇచ్చారు. `ఎదురులేని మ‌నిషి` సినిమాకి కూడా ఇంత పాజిటివ్ రివ్యూలు రాలేదు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి, కాలేజీ స్టూడెంట్స్ అంద‌రికీ బాగా క‌నెక్ట్ అయింది. కానీ ఒక‌టే అసంతృప్తి. థియేట‌ర్లు ఇచ్చారు. క‌లెక్ష‌న్స్ బాగున్నాయి. కానీ ఇంకా ఎక్కువ‌గా దొరికి ఉంటే బాగుండేది. థియేట‌ర్లు పెంచుతార‌ని ఆశిస్తున్నా. అంత అనుభవం ఉన్నా థియేట‌ర్లు సంపాదించుకోలేక‌పోయాన‌నే బాధ ఉంది` అని అన్నారు.
 
నిర్మాత సావిత్రి మాట్లాడుతూ, ` న‌టుడిగా మా అబ్బాయి హ‌రి పాస‌య్యాడు. చాలా సంతోషంగా ఉంది. కానీ నిర్మాత‌గా థియేట‌ర్లు దొర‌క‌లేద‌నే బాధ బాధ ఉంది. అంతా సపోర్ట్ చేసారు. కానీ మొద‌ట్లోనే ఎక్కువ థియేట‌ర్లు ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్ప‌టికైనా థియేట‌ర్లు పెంచుతార‌ని ఆశిస్తున్నా` అని అన్నారు. సినిమా ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు న‌టుడు రాహుల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.