సందీప్ చీలం ‘వ‌న్ మెన్ ఆర్మీ’ ఫ‌స్ట్ లుక్

సందీప్ చీలంను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ అను ప్రొడక్షన్స్ & మ్యాజిక్ ఫ్రేమ్స్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న సినిమా ‘వ‌న్ మెన్ ఆర్మీ’. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలోనే జ‌రిగింది. తెలుగు ఇండ‌స్ట్రీలో అత్యంత అరుదుగా జ‌రిగుతుంది ఇది. ఈ సినిమాను కొత్త ద‌ర్శ‌కుడు శివ తెర‌కెక్కిస్తున్నారు. షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది. హీరో సందీప్ చీలం పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వ‌న్ మెన్ ఆర్మీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ సినిమాను అను ప్రొడక్షన్స్ లో అన‌సూయ రెడ్డి నిర్మిస్తున్నారు. మిస్ పూణే ట్విశ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. మూడు సార్లు మిస్టర్ వరల్డ్ గా టైటిల్ కైవసం చేసుకొన్న కమల్ దీప్ కామ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. పంక‌జ్ రాయ్, కామెరాన్ జేక్ సంయుక్తంగా ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. ఎడిటింగ్ విజ‌య్ వ‌ర్ద‌న్.. మ్యూజిక్ డైరెక్టర్ స్యాండి చేస్తున్నారు. మ్యాడ్ మాక్స్ ఫ్యూరీ రోడ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి స్టంట్స్ అందించిన జుడ్ వైల్డ్ ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్ గా ప‌ని చేస్తున్నారు. డిజైనింగ్ వ‌ర్క్స్ అన్నీ ఎంకేఎస్ మ‌నోజ్ చేస్తున్నారు. మిగిలిన షూటింగ్ కూడా వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని చెబుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మిగిలిన క్యాస్ట్ అండ్ క్ర్యూ గురించి త్వ‌ర‌లోనే తెలియ‌జేయ‌నున్నారు చిత్ర‌యూనిట్.
 
న‌టీన‌టులు..
సందీప్ చీలం – హీరో
ట్విశ శర్మ – హీరోయిన్ (మిస్ పూణే)
 
సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: శివ‌,నిర్మాత‌: అన‌సూయ రెడ్డి,బ్యాన‌ర్: అను ప్రొడక్షన్స్ & మ‌్యాజిక్ ఫ్రేమ్స్
సినిమాటోగ్ర‌ఫీ: ప‌ంక‌జ్ రాయ్, కామెరాన్ జేక్, ఎడిట‌ర్: విజ‌య్ వ‌ర్ధ‌న్ కావూరి,మ్యూజిక్ డైరెక్టర్: స్యాండి
స్టంట్స్: జుడ్ వైల్డ్
‘One Man Army’ first look released

 One Man Army’ introduces Sandeep Cheelam as the hero.  Jointly produced by Anu Productions and Magic Frames Productions, its entire shooting has happened in Australia.  It’s rare in the Telugu film industry that something of this sort has taken place.

Debutant director Shiva is wielding the megaphone.  The shoot is in the last leg currently.The First Look of the entertainer is being released to mark the birthday of the hero.
Twisha Sharma, a model who was Miss Pune, is the heroine of this movie.  Kamal Deep Kama, who has won the Mr. World title thrice, is playing the antagonist.Pankaj Roy and Cameron Jake are doing the cinematography.The film’s stunt master is Jude Wild, who previously worked on ‘Mad Max: Fury Road’.  Designing work is by MKS Manoj.
The rest of the shoot will be wrapped up soon and the release date announced after that.  The rest of the cast and crew details will be revealed soon.
Director: Siva
Producer: Anasuya Reddy,Banner: Anu Productions & Magic Frames
Cinematography: Pankaj Roy & Cameron Jake,Editing: Vijay Vardhan Kavuri
Music Director: Sandy,Stunts: Jude Wild