ప్రముఖ సినీ, రంగస్థల నటుడు డీఎస్ దీక్షితులు (62)అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు.జీవితాంతం నటనా రంగానికే అంకితమైన దీక్షిత్ నటిస్తూనే తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె. కృష్ణ వంశీ దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన ‘మురారి’ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, అతడు మొదలైన చిత్రాల్లో ఈయన ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 28వ తేదీ 1956వ సంవత్సరంలో హనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు జన్మించిన ఈయన సంస్కత, తెలుగు భాషలలో రంగస్థల కళల్లో ఎం.ఏ. డిగ్రీలు పొందాడు. రంగస్థల నటుడిగా, అధ్యాపకుడిగా మంచి పేరు గడించారు. ఆల్ ఇండియా రేడియోలో నటుడిగా పలు నాటకాల్లో నటించారు.రంగస్థల, టెలివిజన్, సినిమా మాధ్యమాలలో యెంతో మందికి అక్కినేని నటవిద్యాలయం ద్వారా నటశిక్షణ యిచ్చారు.గురుపరంపర విధానం ఆచరిస్తూ,తన గురువులను గౌరవించడం, గురువుగా తనశిష్యులకు దిశానిర్దేశం చేసిన గొప్ప ఆచార్యులు.వ్యాపారాత్మక ఆలోచనలకు తన వ్యాసంగాన్ని మళ్ళించకుండా, రంగస్థలానికి పూర్తిగా అంకితమైన రంగస్థల ప్రముఖులు. డి.యస్.దీక్షిత్ లేని లోటు పూడ్చ లేనిది