కమల్ శంకర్ ‘భారతీయుడు 2’ ఆగిపోయిందా?

‘2.ఓ’లాంటి గ్రాఫిక్స్‌ మాయాజాలం తరువాత శంకర్‌ మరో ప్రాజెక్ట్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. గతంలో ‘యూనివర్సల్‌ హీరో’ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కించిన ‘భారతీయుడు’ సినిమా ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందోప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు2’ ను శంకర్‌ రూపొందిస్తున్నారు.పూజా కార్యక్రమాలను ప్రారంభించిన ఈ చిత్రయూనిట్‌.. అకస్మాత్తుగా షూటింగ్‌ను ఆపేసారు.
‘భారతీయుడు 2’ సినిమా చిత్రీకరణ ఆగిపోయిందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. 23 ఏళ్ల తర్వాత మరోసారి శంకర్, కమల్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. జనవరిలో చిత్రీకరణ మొదలైంది. అయితే దర్శకుడు శంకర్‌కు.. సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ సంస్థకు బడ్జెట్‌ విషయంలో అభిప్రాయభేదాలు తలెత్తాయని తమిళ వర్గాలు అంటున్నాయి.
 
సాధారణంగా శంకర్‌ సినిమాలంటేనే ఎక్కువ బడ్జెట్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతుంటాయి. అయితే ‘భారతీయుడు 2’కు శంకర్‌ అడుగుతున్నంత బడ్జెట్‌ కేటాయించడానికి లైకా సంస్థ సిద్ధంగా లేదట. దాంతో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా చిత్రీకరణను నిలిపివేసినట్లు సమాచారం. అయితే దీని గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అగ్రిమెంట్ చేయమన్నారు !
శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ‘2.0’. ఈ చిత్రంలో ప్రతి కథానాయకుడుగా అక్షయ్ కుమార్ నటించారు. హీరోయిన్‌గా అమీ జాక్సన్ నటించింది. భారీ తారాగణం, భారీ బడ్జెట్, భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం నష్టాన్ని కూడా భారీగానే మిగిల్చిందట. ‘2.0’ను లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ రూపొందించింది. తాజాగా లెక్కలు చూసుకున్న నిర్మాతలు ఈ సినిమా కారణంగా రూ.100 కోట్లు నష్టం వచ్చిందని తేల్చారట.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ‘2.0’ని నిర్మిస్తున్నారు. ‘2.0’ ఎఫెక్ట్ కారణంగా.. ‘ఇండియన్ 2’ సినిమా నిర్మాణం విషయంలో శంకర్‌కి నిర్మాతలు ఒక షరతు పెట్టారట. రూ.250 కోట్లలోపు ఖర్చుతో ఫస్టుకాపీ ఇస్తానని అగ్రిమెంట్ చేయమన్నట్టుగా సమాచారం.