`ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌` 22న ప్రేక్ష‌కుల ముందుకు

ద‌ర్శ‌కుడు జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస‌రావు త‌న‌యుడు హ‌రికృష్ణ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం `ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌`. అక్షిత క‌థానాయిక‌. ఝాన్సీ ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. జెఎస్ ఆర్ మూవీస్ ప‌తాకంపై సావిత్రి జొన్న‌ల‌గ‌డ్డ నిర్మిస్తున్నారు. యాజ‌మాన్య సంగీతం అందించారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తగా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్బంగా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఆదివారం హైద‌రాబాద్ సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన న‌టుడు శ్రీకాంత్ తొలి జ్ఞాపిక‌ని యాజ‌మ‌న్య‌కు అందించారు.
 
శ్రీకాంత్ మాట్లాడుతూ ` శ్రీనివాస‌రావు చాలా సంవ‌త్స‌రాలుగా తెలుసు. త‌నకి సిన‌మా త‌ప్ప మ‌రో ప్ర‌పంచం తెలియ‌దు. చాలా సినిమాల‌కు ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. మంచి టెక్నిషీయ‌న్. వాళ్ల‌బ్బాయిని హీరోగా ప‌రిచయం చేస్తూ త‌నే అన్ని బాధ్య‌త‌లు తీసుకుని ఎన్ని క‌ష్టాలు ఎదురైనా ఫ్యాష‌న్ తోనే శ్ర‌మించాడు. హ‌రి లో మంచి జీల్ ఉంది. సినిమా కోసం త‌ను కూడా చాలా హార్డ్ వ‌ర్క్ చేసాడు. డాన్సులు ఇర‌గ‌దీసాడు. ఫ్యూచ‌ర్ లో మంచి స్టార్ అవుతాడ‌న్నా`రు.
 
కాశీ విశ్వ‌నాథ్ మాట్లాడుతూ ` శ్రీనివాసరావు మంచి మిత్రుడు. త‌న గ‌త సినిమాల్లో నేను కూడా న‌టించాను. `న‌చ్చావు`లే సినిమా త‌ర్వాత శ్రీను అలాంటి మంచి పాత్ర ఈ సినిమ‌లో ఇచ్చాడు. ఆ సినిమాక‌న్నా ఈ చిత్రం పెద్ద స‌క్సెస్ అవ్వాలి` అని అన్నారు.
 
మ‌రుదూరి రాజా మాట్లాడుతూ ` హ‌రిలో మంచి ఫైర్,పెర్పామెన్స్ ఉంది. అంత‌కు మంచి ఎనెర్జీ లెవ‌ల్స్ ఉన్నాయి. మంచి క‌థ‌తో హీరోగా ప‌రిచయం అవుతున్నాడు. హీరో- ఝాన్సీ పాత్ర‌ల మ‌ధ్య స‌వాల్ తో క‌థ న‌డుస్తుంది. అక్క‌డ ఎదురైన ఓ స‌వాల్ అమ్మాయి ప్రేమ‌కు ఎలా దారితీసింద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. రెండు పాత్ర‌లు సినిమాలో బాగా పండుతాయి. ఈ సినిమా కోసం తండ్రీ కొడుకులిద్ద‌రూ ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు. ఈ సినిమా ను ప్రేక్ష‌కులంతా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
 
చిత్ర హీరో హ‌రికృష్ణ మాట్లాడుతూ ` రెగ్యుల‌ర్ ల‌వ్ స్టోరీల‌కు భిన్నంగా ఉంటుంది. ఇదో పెయిన్ పుల్ స్టోరీ. ప్రేమ‌కు కొత్త అర్ధం చెప్పే సినిమా. ప్రేమ అంటే అమ్మాయి అబ్బాయి ఉంటే స‌రిపోతుంద‌నుకుంటారు. కానీ స్నేహితుడు లేక‌పోతే ప్రేమ లేద‌ని చెప్పే సినిమా ఇది. స్నేహితుడి విలువ‌ను చాటి చెప్పే క‌థ‌. క్లైమాక్స్ ఆద్యంత ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు త‌ల్లిదండ్రులైనా చాలా ప్రొఫెష‌నల్ గా వ్వ‌వ‌హ‌రించారు. ఈనెల 22న సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్ష‌కులంతా విజ‌యవంతం చేస్తార‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.
 
హీరోయిన్ అక్షిత మాట్లాడుతూ ` రొటీన్ ప్రేమ క‌థ‌ల‌కు భిన్నంగా ఉంటుంది. చాలా రియ‌ల్ స్టిక్ గా ఉండే సినిమా ఇది. చాలా స‌న్నివేశాలు ఎమోష‌న్ తో న‌డుస్తాయి` అని అన్నారు.
 
ద‌ర్శ‌కుడు జొన్న‌లగ‌డ్డ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ `సీనియ‌ర్ ఎన్టీఆర్ గారు న‌టించిన ‘మేజ‌ర్ చంద్ర కాంత్’ తో పాటు చాలా సినిమాల‌కు ప‌ని చేసాను. త‌ర్వాత కొన్ని సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాను. క‌థ‌ను న‌మ్మి చేసిన సినిమా ఇది. ఈ క‌థ గురించి కొంద‌రికి చెబితే కొన్ని స‌ల‌హాలు ఇచ్చారు. కానీ అవేవి నాకు న‌చ్చ‌లేదు. నేను తీయాల‌నుకున్న‌ది తీసాను. బాగా వ‌చ్చింద‌ని న‌మ్ముతున్నాం. హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కూ డా మంచి ధ‌ర ద‌క్కింది. అల్లు అర‌వింద్ గారు సినిమాకు ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తున్నారు. ఆయ‌న స‌హ‌కారం ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిది. ఈనెల 22న‌ ప్రేక్ష‌కుల మందుకు వ‌స్తున్నాం. త‌ప్ప‌కుండా అద‌రిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
 
గంగారావు, రాహుల్ బొకాడియా, ఏఆర్ సి బాబు, రాజారావు, రాఘ‌వ‌పూడి, సిప్పీ, పింగ్ పాంగ్, మింటు, రాహుల్, వినీత్, అవినాష్, వాణి చౌద‌రి, రాజు, ర‌సూల్, విటాల్, వేదాంత్ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: వ‌న‌మాలి, గోస‌ల రాంబాబు, ఛాయాగ్ర‌హ‌ణం: వ‌ంశీ ప్ర‌కాష్, ఎడిటింగ్: జాన‌కి రామ్, కో డైరెక్ట‌ర్ : సిప్పీ, పీర్ ఓ: స‌తీష్‌, స్ర్కీన్ ప్లే భూప‌తి రాజా, మ‌రుధూరి రాజా, రాజేంద్ర కుమార్, మాట‌లు: సుబ్బారాయుడు బొంపెం, కొరియోగ్ర‌పీ: ప‌్రేమ్ ర‌క్షిత్, విద్యాసాగ‌ర్, శ్రీద‌న్, ఫైట్స్: రామ్ సుంక‌ర‌, నిర్మాత : సావిత్రి జొన్న‌ల‌గ‌డ్డ‌