వరుణ్‌తేజ్… మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2’ ఘన విజయం సాధించడంతో యంగ్ హీరో వరుణ్‌తేజ్ ఎంతో సంతోషంగా ఉన్నారు. ‘అంతరిక్షం’ సినిమా ఫలితానికి నిరాశపడినప్పటికీ ఒక్క నెల గ్యాప్‌లోనే అతను నటించిన ‘ఎఫ్2’ చిత్రం సంక్రాంతి విన్నర్‌గా నిలవడంతో ఎంతో ఉత్సాహంగా తన తదుపరి చిత్రంపై దృష్టిపెడుతున్నారు. వరుణ్‌తేజ్ నెక్స్ సినిమాను అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ స్వయంగా నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఈ సినిమాలో వరుణ్ ఒక బాక్సర్ పాత్రలో కనిపిస్తారట. అందుకే ఈ చిత్రం కోసం ఈ యంగ్ హీరో ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునే పనిలో పడ్డారట. అమెరికా వెళ్లి బాక్సింగ్‌లో మెళకువలను నేర్చుకోబోతున్నారని తెలిసింది. ఒక రియల్ బాక్సర్ తరహాలో వరుణ్ కండలు పెంచుతారట. ఈ సినిమాను నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తాడు. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌కు బాక్సింగ్ కోచ్ పాత్రలో ‘యాక్షన్ కింగ్’ అర్జున్ నటిస్తారని సమాచారం.
మరో మల్టీ స్టారర్ కు సిద్ధం !
ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలు కుర్ర హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ మంచి విజయం సాధిస్తున్నారు. ఇటీవల వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఎఫ్2’ ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రానికి భారీ ఆదరణ లబించింది. వెంకీ, వరుణ్‌లు తోడళ్ళులుగా ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించారు. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ మరో మల్టీ స్టారర్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది.
‘డీజే’ చిత్రం తర్వాత హరీష్ శంకర్ త్వరలో కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘జిగర్తాండా’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నాడట. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుందట. తమిళంలో సిద్ధార్ధ్, బాబీ సింహాల పాత్రలని తెలుగులో నాగ శౌర్య, వరుణ్ తేజ్‌లు పోషించనున్నారని అంటున్నారు. తెలుగు నేటీవిటికి తగ్గట్టుగా హరీష్ శంకర్ స్క్రిప్ట్‌ని సిద్దం చేసుకోగా వచ్చే నెలలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందట. జిగర్తాండ్రా చిత్రం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కగా, ఈ చిత్రం పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది