తెలుగు సినిమా దర్శకుడు కట్టా రంగారావు అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. చివరగా ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘జయ జానకి నాయక’ సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. రంగారావు కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చారు. తన సినీ కెరీర్ ఆరంభంలో విప్లవ భావజాల సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నారు. 1957 మే 5న రంగారావు జన్మించారు.రాజశేఖర్ ‘ఇంద్రధనుస్సు’ సినిమాతో ఆయన దర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. 1990ల్లో ఆయన పలు కమర్షియల్ సినిమాలు తెరకెక్కించారు. ఇంద్ర ధనుస్సు, ఆఖరి క్షణం, ఉద్యమం, అలెగ్జాండర్, నమస్తే అన్నా, బొబ్బిలి బుల్లోడు, వారెవా మొగుడా, చెప్పుకోండి చూద్దాం తదితర సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. 40ఏళ్లకు పైగా తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన పని చేశారు. దర్శకుల సంఘంలోనూ అనేక పదవుల్లో రంగారావు పని చేశారు. సూర్యాపేట జిల్లాలోని మేడారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. రంగారావు మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.