91వ ఆస్కార్ వేడుక… దేశవిదేశాల నుంచి తరలివచ్చిన ఆహూతుల ఆనందోత్సాహాల మధ్య 91వ ఆస్కార్ వేడుక అట్టహాసంగా జరిగింది. విజేతల ఆనంద హేళలు, ఆస్కార్ ప్రతిమను ముద్దాడే వేళ భావోద్వేగాలతో సంబరం అంబరాన్నంటింది. అత్యధిక పురస్కారాలతో జయకేతనం ఎగరవేసింది ‘బొహెమియన్ రాప్సొడీ’. ఈ చిత్రానికి నాలుగు ఆస్కార్‌లు అందాయి. తర్వాతి స్థానంలో మూడు పురస్కారాలతో ‘రోమా’, ‘గ్రీన్‌బుక్’, ‘బ్లాక్‌పాంథర్’ ఉన్నాయి.
ఇదే వేదికపై భారతీయ ప్రతిభ పరిమళించడం విశేషం. భారతీయ సంస్థ నిర్మించిన ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ పురస్కారం గెలుచుకుంది.
భారత స్త్రీల సమస్యకు దర్పణం:
ఓ భారతీయ సంస్థ నిర్మాణంలో భారతదేశంలో చిత్రీకరించిన ఓ డాక్యుమెంటరీ ఆస్కార్ బరిలో సంచలనం సృష్టించింది. ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్)గా పురస్కారం సొంతం చేసుకుంది. అదే ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’. ‘మసాన్, లంచ్ బాక్స్ లాంటి చిత్రాలను నిర్మించిన భారతీయ నిర్మాత గునీత్ మొంగ్యాకు చెందిన సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇరానియన్ అమెరికన్ దర్శకురాలు రేకా జెహ్‌తాబ్చి తెరకెక్కించిన ఈ చిత్రం, భారతీయ గ్రామీణ స్త్రీలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్లకు కట్టింది.
ఆస్కార్ విజేతలు వీరే !
* ఉత్తమ చిత్రం – గ్రీన్‌బుక్
* ఉత్తమ విదేశీ భాషా చిత్రం – రోమా (మెక్సికో)
* ఉత్తమ నటుడు – రమీ మాలెక్ (‘బొహెమియన్ రప్సోడీ’)
* ఉత్తమ నటి – ఒలీవియా కోల్‌మాన్ (‘ది ఫేవరెట్’)
* ఉత్తమ దర్శకుడు – అల్ఫోన్సో కువరన్ (‘రోమా’)
* ఉత్తమ సహాయ నటుడు – మహెర్షలా అలీ (‘గ్రీన్‌బుక్’)
* ఉత్తమ సహాయ నటి – రెజీనా కింగ్ (‘ఇఫ్ బీట్ స్ట్రీట్ కుడ్ టాక్’)
* ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – నిక్ వల్లెలొంగ, బ్రెయిన్ క్యూరీ, పీటర్ ఫరెల్రీ (‘గ్రీన్‌బుక్’)
* ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – చార్లీ, డేవిడ్, కెవిన్, స్పైక్‌లీ (‘బ్లాక్ క్లాన్స్‌మ్యాన్’)
* ఉత్తమ యానిమేటెడ్ చిత్రం – స్పైడర్‌మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వెర్స్
* ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ చిత్రం – ఫ్రీ సోలో
* ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ – పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్
* ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం – స్కిన్
* ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం – బావొ
* ఉత్తమ ఒరిజినల్ స్కోర్ – లుడ్‌విగ్ గొరన్‌సన్ (‘బ్లాక్ పాంథర్’)
* ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – ‘షాలో..’(‘ఎ స్టార్ ఈజ్ బోర్న్’)
* ఉత్తమ ఛాయాగ్రహణం – అల్ఫోన్సో కువరన్ (‘రోమా’)
* ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ – జాన్ ఒట్‌మ్యాన్ (‘బొహెమియన్ రప్సొడీ’)
* ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ – జాన్ వార్‌హస్ట్, నీనా హార్ట్‌స్టోన్ (‘బొహెమియన్ రప్సొడీ’)
* ఉత్తమ సౌండ్ మిక్సింగ్ – పాల్ మస్సీ, టిమ్ కవగిన్, జాన్ కసలి (‘బొహెమియన్ రప్సొడీ’)
* ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ – గ్రెగ్, కేట్, పేట్రిసియా(‘వైస్’)
* ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – రూథ్ ఇ.కార్టర్ (‘బ్లాక్ పాంథర్’)
* ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – పాల్, ఇయాన్, ట్రిస్టాన్, జె.డి.స్కవల్మ్ (‘ఫస్ట్‌మ్యాన్’)
* ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – హన్నా బీచ్లర్, జే హార్ట్ (‘బ్లాక్ పాంథర్’)