15 వయసు.. 18 వయసు.. 24 వయసు.. ఈ మూడు దశల్లో ప్రేమ ఎలా ఉంటుంది? ఆ ప్రేమల్లో గమ్మత్తయిన సంగతులేంటి? ఈ ట్రాక్ లోనే ఊహించని ఓ యాక్సిడెంట్ మొత్తం కథను ఎలా మలుపు తిప్పింది? అన్నదే `15-18-24 లవ్ స్టోరీ` అని అంటున్నారు దర్శకుడు కిరణ్. నిఖిలేశ్వర్, సాహితి, కీర్తన్, సిమ్రాన్ సానియా, ఉపేంద్రా, పారుల్ బిందల్ , ఈషా ,ధన్య శ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం `15-18-24 లవ్ స్టోరీ`. మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విమాలాద్రి క్రియేషన్స్, మాజేటి మూవీ మేకర్స్ , కిరణ్ టాకీస్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డా.అక్కినేని నాగేశ్వరరావు సెంటిమెంట్ పూజా గృహం.. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్‌లో ఈ సినిమా టైటిల్ లోగో రిలీజైంది. ఫైట్ మాస్టర్ విజయ్ వారసుడు రాహుల్ విజయ్ – సంతోషం అధినేత సురేష్ కొండేటి సంయుక్తంగా లోగోని ఆవిష్కరించారు.
దర్శకుడు కిరణ్ కుమార్ మాడుపూరి మాట్లాడుతూ-కులుమనాలి, గోవా, హైదరాబాద్ లో మూడు ప్రేమ జంటల మధ్య సాగే ప్రేమకథా చిత్రమిది. చక్కటి కధ , కధనాలతో ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. కులుమనాలి, హైదరాబాద్, కేరళ, గోవాలో చిత్రీకరించారు. మూవీలో ఓ యాక్సిడెంట్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. ఆ సీన్ ని ఫైట్ మాస్టర్ విజయ్ తెలుగు సినీ చరిత్రలో కనీ వినీ ఎరుగనీ రీతిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి సమ్మర్ లో సినిమా రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.
నిర్మాతలు బొద్దుల సుజాత శ్రీనివాస్, స్రవంతి ప్రసాద్ మాట్లాడుతూ-“70 శాతం చిత్రీకరణ పూర్తయింది. చివరి ఫైట్ చిత్రీకరణ పూర్తి చేస్తున్నాం. ఆడియో త్వరలో రిలీజ్ చేస్తాం. సూపర్ హిట్ చిత్రం అవుతుంది“ అన్నారు.
సంగీత దర్శకుడు జయవర్ధన్ మాట్లాడుతూ –“ఇందులో మూడు ప్రేమకథలు ఆసక్తికరం. యాక్సిడెంట్ నేపథ్యం అద్భుతంగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది. మూడు ప్రేమకథలకు మూడు రకాల టోన్ లలో సంగీతం అందించడం ఎంతో కష్టంతో కూడుకున్నది. సంగీతం మైమరిపిస్తుంది“ అస్నారు.
నిఖిలేశ్వర్, సాహితి, కీర్తన్, సిమ్రాన్ సానియా, ఉపేంద్రా, పారుల్ బిందల్, ఈషా, ధన్య శ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొని తమకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.
ఈ సినిమాకి నిర్మాతలు : బొద్దుల సుజాతాశ్రీనివాస్, స్రవంతి ప్రసాద్. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ : పి. హజారత్ బాబు. సంగీతం: జయవర్ధన్.అంకే, కెమెరా: రాజేష్, ఫైట్స్: విజయ్ మాస్టర్ , కోరియోగ్రఫీ : గణేష్ మాస్టర్, కో-డైరెక్టర్ & ఎడిటర్ : సన్నపు కుమార్ బాబు